Namaste NRI

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 19వ ఆటా మహాసభలకు ఆహ్వానించిన ATA ప్రతినిధులు

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అటా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మేరీలాండ్ బాల్టిమోర్ లో నిర్వహించనున్న అసోసియేషన్ 19వ తెలుగు మహాసభలకు హాజరుకావాలని ఆహ్వానం అందించారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేష‌న్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కో-ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజినల్ కో-ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events