అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లో మినీ మహానాడు ఘనంగా జరిగింది. ప్రవాసాంధ్రుడు భాను మాగులురి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సహకరిస్తామని , రాష్ట్రంలోని ప్రవాసాంధ్రుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తీర్మానం చేసి ఆమోదించిచారు. సామాజిక న్యాయం సంక్షేమ రాజ్యన్ని స్థాపించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు యశస్వి బొద్దులురీ, సత్యనారాయణ మన్నే , జానకిరామ్ భోగినెని,రమేష్ అవిర్నేని తదితరులు పాల్గొన్నారు.





























