Namaste NRI

ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు మరియు మినీ మహానాడు

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 104 వ జయంతి వేడుకలు, మినీ మహానాడు దోహాలో ఎన్నారై టిడిపి ఖాతార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నరేష్ మద్దిపోటి సారథ్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు భారీగా ప్రవాస తెలుగువారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభా ప్రాంగణం అంతా జై ఎన్టీఆర్ నినాదాల తో మారు మోగింది. ఖాతార్ లో తెలుగు సమాజం ఐక్యత తెలుగుదేశం పార్టీ పై అభిమానం ఈ సభ ద్వారా రుజువు అయిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ఏపీ గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. ఎన్టీఆర్ 104 వ జయంతి సందర్భంగా మంత్రి ప్రత్యేక గీతాన్ని విడుదల చేయగా అది అందరినీ ఆకట్టుకుంది.

“మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గీతంతో ప్రారంభమైన సభ దేశభక్తి, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాగింది. చిన్నారుల కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఎన్టీఆర్ పాత్రలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన సోలో యాక్ట్స్‌కు ఘనమైన స్పందన లభించింది.సభలో భాగంగా పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా దోహా నుంచి విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలకు త్వరితగతిన ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానం చేశారు.అలాగే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న బ్లూ కాలర్ కార్మికులకు ఏపీఎన్‌ఆర్టీ సేవలను మరింత విస్తృతంగా అందించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా “ఎన్‌ఆర్‌ఐ గ్రీవెన్స్ సెల్” ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా తెలుగు ప్రవాసుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రవాస ఆంధ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా ఖతార్‌లో 25 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ తెలుగు సమాజానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ప్రత్యేకంగా సత్కరించారు. మంత్రి కొలుసు పార్థసారథి జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

అనంతరం కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, మినీ మహానాడు సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.ఈ కార్యక్రమంలో ఖతార్ టీడీపీ నాయకులు మద్దిపోటీ నరేష్, పొనుగుమాటి రవి, విక్రమ్ సుఖవాసి, బొద్దు రామారావు, జేవీవీ సత్యనారాయణ, మల్లిరెడ్డి సత్యనారాయణ, నూతలపాటి నరేష్, కొడాలి సుధాకర్, మల్లేశ్వరరావు తదితరులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తెలుగు ప్రవాసులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events