Namaste NRI

అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు వేడుక

టీడీపీ మహానాడు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. హైబ్రీడ్ విధానంలో ఈ సారి కార్యకర్తలు 1875 క్లస్టర్ల నుండి మహానాడును వీక్షించనున్నారు. ముక్యమైన నాయకుల ప్రసంగాలు కూడా హైబ్రీడ్ విధానం లో 175 నియోజకవర్గలలో ఆన్ లైన్ లో
విననున్నారు.దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కేంద్ర కార్యాలయం నుండి ఏర్పాటు చేశారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి..మహానాడులో చంద్రబాబు ఆదేశం : పార్టీ శ్రేణులు స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలలో గెలుపే ప్రదానమని స్పష్టం చేశారు. గెలుపే ధ్యేయంగా నేతలు కార్యకర్తలు పనిచేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తు ముందుకు వెళ్లాలని సూచించారు. మిత్ర పక్షాలను కలుపుకుని, సమన్యయం చేసుకొని ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.2024 ఎన్నికల్లో సాధించిన విజయం మళ్లీ రిపీట్ చేయాలి అని కోరారు.

ఇకపై మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తాము .. మహానాడులో లోకేష్ ప్రకటన:
మహానాడు వేడుకను పురస్కరించుకుని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడుతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించిన లోకేష్ అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో బిల్లు పాస్ అయినా కాకపోయినా వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ వెల్లడించారు. తెదేపా సిద్ధాంతలే మనకు బలం. రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవాహం కేవలం చంద్రబాబు నాయుడు కృషి వలనే వస్తున్నాయి అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events