
శ్రీహరి, స్మిత జంటగా నటిస్తున్న చిత్రం పళ్లైంది కానీ నో కహాని. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకుడు. మై3 సినిమాస్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా పోస్టర్‌ను హీరో రాజ్‌తరుణ్ విడుదల చేశారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని, ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని, ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్ అని హీరో శ్రీహరి తెలిపారు. అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బాలు కె లయరాగ్, రచన, దర్శకత్వం: ఏడుకొండలు తాడిశెట్టి.





























