హంగేరి పార్లమెంట్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రితో పాటు ఎంపీల జీతాల్లో 40 శాతం కోత విధించే ఈ బిల్లుకు 189 మంది ఎంపీలు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ పరిపాలనా వ్యయాన్ని తగ్గించుకోవడం, దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడంలో ఈ బిల్లు కీలకంగా వ్యవహరించనుందని ఆ దేశ ప్రధాని పీటర్ మాగ్యర్ తెలిపారు. ఈ బిల్లుతో ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీని నెరవేర్చినట్టు అయింది.

మాజీ ప్రధానమంత్రి విక్టర్ అప్పటి చట్టసభ సభ్యులను సంతృప్తి పరచడానికి ఎంపీల జీతాలను విపరీతంగా పెంచేశారని, అది పరిపాలనా వ్యయాన్ని పెంచి ఆర్థిక స్థితిపై ప్రభావం చూపిందని ప్రస్తుత ప్రధాని పీటర్ తెలిపారు. కేవలం జీతాలే కాకుండా ఎంపీలకు లభించే అలవెన్సుల్లో కూడా ఈ కోత వర్తించనుంది. హంగేరి ఆర్థిక భద్రతను పెంచడంలో ఈ బిల్లు కీలకం కాబోతుందని ప్రధాని పీటర్ స్పష్టం చేశారు. ఎంపీల జీతాల్లో కోత ద్వారా వచ్చే ఆదాయం ఒక ఏడాది ప్రభుత్వ పరిపాలనకు సరిపోయే వ్యయాన్ని సమకూరుస్తుందని వెల్లడించారు.





























