Namaste NRI

ఆటా ఆధ్వర్యంలో ఘనంగా ఝుమ్మంది నాదం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన ఝుమ్మంది నాదం, సయ్యంది పాదం, బ్యూటీ పేజెంట్ 2026 సెమీ ఫైనల్ ఘనంగా జరిగాయి. 19వ ఆటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్‌లో భాగంగా న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిం. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు కుటుంబాలు, కమ్యూనిటీ నాయకులు, కళాభిమానులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. సంప్రదాయబద్దంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేడుకలో మొత్తం 150 మంకి పైగా పోటీదారులు పాల్గొని తమ ప్రతిభను పదర్శించారు. న్యూజెర్సీతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి దాదాపు 350కి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు.

ఝుమ్మంది నాదం సంగీత పోటీలో సుమారు 70 మంది శాస్త్రీయ, సినీ గీతాలను ఆలపిస్తూ తమ మధుర గానంతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం జరిగిన సయ్యంది పాదం నృత్య పోటీలో మరో 70 మంది కళాకారులు కూచిపూడి, భరతనాట్యం తదితర భారతీయ శాస్త్రీయ నృత్యాలతో పాటు జానపద, దేశభక్తి, సినీ గీతాలకు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన బ్యూటీ పేజెంట్ 2026 సెమీ ఫైనల్స్‌లో 35 మంది పోటీదారులు పాల్గొని తమ వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సంస్కృతి పట్ల అవగాహనను ప్రదర్శించారు. విజేతలకు క్రౌన్లు, మెడల్స్ మెమెంటోలు అందజేశారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో జులై 31 నుంచి ఆగస్ట్ 2, 2026 వరకు మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక 19వ ఆటా మహాసభలు, యÖత్ కన్వెన్షన్ పట్ల ప్రవాస తెలుగు సమాజంలో మరింత ఉత్సాహం నెలకొం. కార్యక్రమానికి హాజరైన అతిథులందరినీ బాల్టిమోర్‌లో జరిగే మహాసభలకు న్యూజెర్సీ బృందం ప్రత్యేకంగా ఆహ్వానించిం.

ఈ కార్యక్రమానికి ఈవెంట్ కో ఆర్డినేటర్ లలిత మÖలే, మహిళా కో ఆర్డినేటర్ గీతా రెడ్డి, రీజినల్ కో ఆర్డినేటర్లు కృష్ణ మోహన్ మÖలే, ప్రదీప్ కట్టా, ప్రసాద్ ఆకుల, రీజినల్ డైరెక్టర్ విలాస్ జంబుల, మెంబర్‌షిప్ చైర్ శ్రీకాంత్ తుమ్మల, కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ శరత్ వేముల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు శ్రీనివాస్ దార్గుల, సంతోష్ రెడ్డి తదితరులు విజయవంతంగా నిర్వహించారు.

బ్యూటీ పేజెంట్, సయ్యంది పాదం, ఝుమ్మంది నాదం చైర్లు, కమిటీ సభ్యులు జడ్జీలు, వాలంటీర్లు, లోకల్ కోఆర్డినేటర్ల సేవలను ఆటా నాయకత్వం ప్రత్యేకంగా అభినంంచిం. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల, ట్రస్టీలు శ్రీనివాస్ దార్గుల, వినోద్ కొడూర్, విజయ్ కుందూర్, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, శ్రీకాంత్ తుమ్మల, హరీష్ బత్తిని తదితరులు నిర్వాహక బృందాన్ని అభినందించారు. బాల్టిమోర్ మహాజసభలను మరింత విజయవంతం చేయాలని వారంతా పిలుపునిచ్చారు.

బ్యూటీ పేజెంట్ 2026 విజేతలు వీళ్లే
మిస్ టీన్ ఆటా- సహన మంతెన , మిస్ ఆటా- ఇషితా రెడ్డి, మిస్టర్ టీన్ ఆటా- సంకీర్త్ మాలసంద్రం, మిస్టర్ ఆటా- స్పర్శ్ ఊటుకూరి, మిసెస్ ఆటా- తేజస్వి వూరే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events