Namaste NRI

భరత వర్ష నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది

గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక చిత్రం భరత వర్ష. సంకల్ప్‌ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. క్రీ.శ. 642 నేపథ్య కథాంశమిది. ఈ సినిమా నుంచి వీర జయధీర అనే తొలిపాటను విడుదల చేశారు. కథానాయకుడి ప్రయాణాన్ని, పరివర్తనను ఆవిష్కరిస్తూ శక్తివంతంగా ఈ పాట సాగింది.

ఓ సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ యోధుడిగా కథానాయకుడు ఎదిగిన వైనం, లక్ష్యసాధన కోసం చేసిన అతను చేసిన పోరాటాన్ని స్ఫూర్తివతంగా ప్రజెంట్‌ చేసింది. అనుదీప్‌దేవ్‌ అందించిన సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యం ఈ పాటలో ప్రధానాకర్షణగా నిలిచాయి. మంచు పర్వతాల నడుమ విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో గోపీచంద్‌ సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్‌దేవ్‌, దర్శకత్వం: సంకల్ప్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events