Namaste NRI

నాగబంధం ట్రైలర్‌ విడుదల

పురాణ రహస్యాలు, దివ్యశక్తుల మహిమలు, సాహసభరితమైన అంశాల కలయికతో విడుదలైన నాగబంధం ట్రైలర్‌ విజువల్‌ ఫీస్ట్‌లా సాగింది. విరాట్‌కర్ణ కథానాయకుడిగా అభిషేక్‌ నామా దర్శకత్వంలో రూపొందుతున్న నాగబంధం-ది సీక్రెట్‌ ట్రెజర్‌ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శతాబ్దాల నాటి రహస్యం చుట్టూ నడిచిన ఈ కథలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భద్రపరచబడిన పవిత్రమైన బ్రహ్మకమలం కీలకమైన అంశంగా కనిపించింది. తరాలుగా రక్షింపబడుతున్న బ్రహ్మ కమలంను స్వాధీనం చేసుకోవాలనే దుష్టశక్తుల పన్నాగాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శివుడి ఆవిర్భావం, నాగసాధువుల ప్రవేశం ట్రైలర్‌లో ఉత్కంఠను పంచాయి.

ఈ సినిమా అద్భుతమైన థియేట్రికల్‌ అనుభూతినందిస్తుందని, టీమ్‌ అంతా ఓ విజన్‌తో పనిచేశామని, నిర్మాణపరంగా అత్యున్నతంగా ఉంటుందని దర్శకుడు అభిషేక్‌ నామా తెలిపారు. ఈ సినిమా చేయడం దైవానుగ్రహమని, మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే చిత్రమిదని నిర్మాత కిషోర్‌ అన్నపురెడ్డి తెలిపారు. పురాతన ఆలయాల రహస్యాన్ని రాబోవు తరాలకు తెలియజేప్పే చిత్రమిదని హీరో విరాట్‌కర్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు అబి-జునైద్‌తో పాటు యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events