Namaste NRI

మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు : చిదంబరం

ప్రతిష్టాత్మక కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, తెస్పియన్‌ ఫిల్మ్స్‌ కలిసి నిర్మించిన విభిన్న కథాచిత్రం బాలన్‌ – ది బాయ్‌. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌ విడుదల చేయడం విశేషం. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. సినిమా విజయం సాధించిందంటూ నిర్మాతల్లో ఒకరైన శైలజా దేశాయి ఫెన్‌ ఆనందం వెలిబుచ్చారు.

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం బాలన్‌ – ది బాయ్‌. తెలుగు ప్రేక్షకుల అభిరుచి గొప్పది. అందుకు ఇక్కడ మా మంజుమ్మెల్‌ బాయ్స్‌కి దక్కిన విజయమే నిదర్శనం. ఇప్పుడు ఈ సినిమాకు కూడా మంచి ఆదరణ లభిస్తున్నది. రియల్‌లైఫ్‌ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాకు కథే పెద్ద స్ట్రెంత్‌. త్వరలో నేరుగా తెలుగు సినిమాను డైరెక్ట్‌ చేయబోతున్నాను. ఆ వివరాలు త్వరలో చెబుతా అని దర్శకుడు చిదంబరం తెలిపారు. నటుడు జీన్‌ పాల్‌లాల్‌, నటి ఫర్జానా పాలతింగల్‌, బాలనటులు మహ్మద్‌ జినాన్‌, ఆది శేషన్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events