Namaste NRI

దిగ్ధర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా హ్రీం మూవీ టీజర్ లాంఛ్

పవన్‌ తాతా, చమింద వర్మ జంటగా నటిస్తున్న చిత్రం హ్రీం. తనికెళ్ల భరణి, రాజీవ్‌ కనకాల, బెనర్జీ, భద్రమ్‌ ఇతర పాత్రధారులు. రాజేశ్‌ రావూరి దర్శకుడు. శివ మల్లాల నిర్మాత. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి టీజర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. దర్శకుడు రాజేశ్‌ చెప్పిన కర్ణపిశాచి కథలోని కోర్‌ పాయింట్‌ నాకు బాగా నచ్చింది.

టీమ్‌ అంతా సపోర్ట్‌ చేయడం వల్లే ఈ సినిమాను చేయగలిగాను. సినిమాలోని 20 నిమిషాల గ్రాఫిక్స్‌ అద్భుతమైన అనుభూతినిస్తాయి అని నిర్మాత శివ మల్లాల తెలిపారు. టీమ్‌ అంతా మక్కువతో చేసిన సినిమా ఇదని, దర్శకుడిగా తనకు అవకాశం ఇచ్చిన శివ మల్లాలకు కృతజ్ఞతలని దర్శకుడు రాజేశ్‌ రావూరి అన్నారు. ఇంకా చిత్రబృందం తోపాటు జర్నలిస్ట్‌ ప్రభు, డైరెక్టర్‌ వరుణ్‌రెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్‌, సంగీతం: మార్కస్‌.ఎం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events