Namaste NRI

మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా సాంగ్ లాంచ్

స్వీయ దర్శకత్వంలో విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మకుటం. సముద్ర నేపథ్య కథాంశమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ తెరకెక్కిస్తున్న 99వ సినిమా ఇది. ఈ చిత్రంలో విశాల్‌ త్రిపాత్రాభినయంలో కనిపిస్తారని, హై ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు.

మూడు పాత్రల్లో ఒకటైన లింగా ఫస్ట్‌లుక్‌ని పరిచయం చేస్తూ రైజ్‌ ఆఫ్‌ లింగా అనే పాటను విడుదల చేశారు. దీనిని విశాల్‌, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ సంయుక్తంగా ఆలపించారు. దుషార విజయన్‌, అంజలి, తంబి రామయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, కథ: రవి అరసు, నిర్మాత: ఆర్‌.బి.చౌదరి, దర్శకత్వం: విశాల్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events