Skip to main content

Namaste NRI

అఖిల్ లెనిన్ ట్రైలర్ రిలీజ్

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న సినిమా లెనిన్. డైరెక్ట‌ర్ మురళీ కిషోర్ అబ్బూరి. ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. అక్కినేని నాగార్జున గంభీరమైన వాయిస్ ఓవర్‌తో, ఇది మహాభారతం అంటూ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. గరుడ పురాణం తరహా రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ అక్కినేని మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ లుక్‌లో సరికొత్తగా కనిపించారు. యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్‌లో అఖిల్ నటన సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో అఖిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, వీరిద్దరి కెమిస్ట్రీ విజువల్స్‌కు మరింత హైలైట్‌గా నిలిచాయి. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివాజీ, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events