Skip to main content

Namaste NRI

శ్రీనివాస మంగాపురం విడుదల అప్పుడే

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణని చిత్రసీమకు పరిచయం చేస్తూ అజయ్‌భూపతి తెరెక్కిస్తున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడాని కథానాయిక. పి.కిరణ్‌ ఈ చిత్రానికి నిర్మాత. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ సమర్పకుడు. డా.మోహన్‌బాబు పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు. తన మార్క్‌ ఇంటెన్సిటీతో అందమైన ప్రేమకథగా దర్శకుడు అజయ్‌ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇందులో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ అంశాలు కూడా ఉంటాయని, జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ జంట యూత్‌ని ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల కానున్నది.ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ ISC, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌, నిర్మాణం: చందమామ కథలు.

Social Share Spread Message

Latest News