Skip to main content

Namaste NRI

అందులో ఏమాత్రం నిజం లేదు : ఇజ్రాయెల్

శాంతి చర్చల్లో పాల్గొన్న ఇరాన్‌ కీలక నేతలను ఇజ్రాయెల్ సైన్యం హత్య చేయాలనుకున్నట్లు అమెరికా మీడియా ప్రచురించిన కథనాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని, అందులో ఏమాత్రం నిజం లేద‌ని ప్రధాని బెంజామిన్ నెతన్యాహు కార్యాలయం స్పష్టంచేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్‌లను హ‌త్య చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్ర‌ణాళిక వేసుకుంద‌ని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్‌లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని, ఈ విషయాన్ని ముందే పసిగట్టిన అమెరికా,ఇరాన్‌కు సమాచారం అందించిందని న్యూయార్క్ టౌమ్స్ ప‌త్రిక వెల్ల‌డించింది. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ చర్చల ప్రతినిధులపై న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన తాజా కథనం పూర్తిగా కల్పితం. వాస్తవాలకు ఏమాత్రం దగ్గరగా లేదుఅని ఇజ్రాయెల్ స్పందించింది.

Social Share Spread Message

Latest News