
ఇరాన్ విషయంలో చర్చలు జరపడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనతో సమావేశానికి అభ్యర్థించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాను నాటో సదస్సు నుంచి వచ్చిన తర్వాత వచ్చే వారంలో చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. తామిద్దరం చాలా బాగా కలిసిపోతామన్నాని, కానీ తమలో బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసని తనను తాను ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. ఇదిలావుంటే ట్రంప్, నెతన్యాహు ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారని అమెరికాలో త్వరలో భేటీ కావాలని నిర్ణయించుకున్నారని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.





























