Namaste NRI

మారెమ్మ నుంచి బ్యూటీఫుల్ రూరల్ మెలోడీ బావ బావ సాంగ్ రిలీజ్

రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా మారెమ్మ తో హీరోగా బిగ్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో మంచాల నాగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ ఈ రోజు మారెమ్మ ఫస్ట్ సింగిల్ బావ బావ సాంగ్ ని రిలీజ్ చేశారు.

ప్రశాంత్ ఆర్ విహారి స్వరపరిచిన ఈ పాటలో పల్లెటూరి మట్టి వాసనతో పాటు మోడరన్ మ్యూజిక్ లేయర్స్ మిళితమై ఎంతో మధురమైన అనుభూతిని కలిగిస్తోంది ప్లజెంట్ ఫీల్‌ను అందించేలా ఈ పాట సాగే తీరు ఆకట్టుకుంటుంది. కమల్ ఎస్లవత్ లిరిక్స్ బావపై ఉన్న ఆప్యాయతను ఎంతో సింపుల్‌గా, హృదయానికి దగ్గరగా వ్యక్తపరుస్తాయి. శృతి రంజని తన స్వరంలో ఉన్న నేచురల్, రస్టిక్ టచ్‌తో పాటకు మరింత ప్రాణం పోసింది. మాధవ్, దీపా బాలు మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వారి యాక్టింగ్‌లో ఉన్న సహజత్వం, పల్లెటూరి అందమైన లోకేషన్స్ కలిసి విజువల్స్‌ ట్రీట్ గా మార్చాయి. ఈ సినిమా విడుదల తేదీ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రశాంత్ అంకిరెడ్డి అందించగా, సంగీతాన్ని ప్రశాంత్ ఆర్ విహారి సమకూర్చారు. ఎడిటర్‌గా దేవ్ రాథోడ్, ఆర్ట్ డైరెక్టర్‌గా రాజ్‌కుమార్ మురుగేసన్ పని చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events