బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది దుర్మరణం చెందారు. వోపాస్ లిన్హాస్ ఏరియాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పరన రాష్ట్రంలోని కాస్కవెల్ నుంచి సావో పౌలోలోని గువారుల్హోస్ వెళ్తున్నది. ఈ క్రమంలో విన్హెడో పట్టణంలో విమానం కుప్పకూలిపోయింది. విమానంలో 58 మంది ప్రయాణికు లతోపాటు నలుగురు సిబ్బంది ఉన్నారని, అంతా మరణించారని అధికారులు వెల్లడించారు. విమానం ఓ ఇంటి పై కూలిపోయిందని, అయితే నివాసితులు క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ప్రమాద ఘటనపై అధ్యక్షు డు లుయూజ్ లులా డిసిల్వా విచారం వ్యక్తం చేశారు.