Namaste NRI

వాల్తేరు వీరయ్యకు మించిన హిట్ : మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం భోళా శంకర్.  మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది.  భోళా శంకర్  ప్రీరిలీజ్‌ వేడుక హైదారాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ  మంచి కంటెంట్‌ ఉన్నప్పుడు రీమేక్‌ చేయడంలో తప్పులేదు. అలాంటి గొప్ప కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఈ సినిమా చేశాను. దర్శకుడు మెహర్‌ రమేష్‌ ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు అన్నారు.

ఈ సినిమా తమిళ మాతృక  వేదాళం ఏ ఓటీటీ వేదికల్లో లేదు. ఎవరూ చూసి ఉండరు కాబట్టి కొత్త కథగానే ఫీలవుతారు.  మొన్న బ్రో వేడుకలో పవన్‌కల్యాణ్‌ చెప్పినట్లు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తు కాదు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడం నా బాధ్యతగా భావిస్తున్నా. ఇండస్ట్రీ అక్షయ పాత్ర వంటిది. ఎంత మంది వచ్చినా అక్కున చేర్చుకుంటుంది. నేను చిన్న పాత్రలు చేసి హీరోగా ఎదిగాను. నా ఉన్నతికి ఆదరించిన ప్రేక్షకులే కారణం. వారికి సర్వదా కృతజ్ఞతగా ఉంటాను అన్నారు.  ఈ సినిమాకి పని చేసిన నటినటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో భోళా శంకర్ నాకు వాల్తేరు వీరయ్య కు మించిన హిట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు

  దర్శకుడు మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ   నేను చిరంజీవి అభిమానుల్లో ఒకడిని. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టం. దర్శకుడిగా ఇది నాకు పునర్జన్మగా భావిస్తున్నా. ఈ జనరేషన్‌కు గ్యాంగ్‌ లీడర్‌, రౌడీ అల్లుడు తరహాలో సినిమా అందించాలనే తపనతో భోళా శంకర్‌ చేశాను.  ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుంది  అని అన్నారు.   నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ చిరంజీవితో సినిమా చేయాలన్నది నా కల. అది ఈ సినిమాతో తీరింది. ఈ ప్రయాణంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఓ మానవతావాదిని చూశా. అభిమానులకు కావాల్సిన ప్రతీ అంశం ఈ సినిమాలో ఉంటుంది అన్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు మోహర్‌ రమేష్‌ రూపంలో నాకు మంచి అన్నయ్య దొరికాడు. ఈ చిత్రానికి ముందు చిరంజీవిగారు మెగాస్టార్‌ అని తెలుసు. కానీ ఆయన మెగా హ్యుమన్‌ అని సినిమా తర్వాత తెలిసింది. ఆయన నుంచి క్రమశిక్షణ, సమయపాలన వంటి ఎన్నో విషయాలను నేర్చుకున్నా అని కీర్తి సురేష్‌ చెప్పింది.  ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, వంశీ పైడిపల్లి, గోపీచంద్‌ మలినేని, బాబీ, సంపత్‌నంది తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events