Skip to main content

Namaste NRI

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కీలక డీల్‌

 ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. ఒప్పందంలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 50 మందిని హమాస్‌ విడుదల చేయనుంది. ప్రతిగా ఇజ్రాయెల్‌ తమ దేశ జైళ్లలో నిర్బంధంలో ఉన్న 150 మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టనుంది. అలాగే గాజాలోకి సహాయ సామగ్రికి అనుమతించనుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇరు వర్గాలు నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ పాటించనున్నాయి. ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్యూ నేతృత్వంలోని క్యాబినెట్ దీనిపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.

హ‌మాస్‌, ఇజ్రాయిల్ మ‌ధ్య యుద్ధం మొద‌లై ఏడు వారాలు దాటింది. ఆ యుద్ధం వ‌ల్ల స్థానిక జ‌నం తీవ్ర నిస్తేజంలో ఉన్నారు. అయితే కాల్పుల విమ‌ర‌ణ స‌మ‌యంలో స్థానిక ప్ర‌జ‌లు కొంత సేద తీరే అవ‌కాశాలు ఉన్నాయి. గ్రౌండ్ ఆప‌రేష‌న్‌తో పాటు వైమానిక ద‌ళ దాడుల‌ను కూడా కాల్పుల విర‌మ‌ణ స‌మ‌యంలో నిలిపివేయ‌నున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events