Skip to main content

Namaste NRI

భారతీయ అమెరికన్‌కు కీలక పదవి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంలో మరో ఇండో అమెరికన్‌కు కీలక పదవి  దక్కింది. యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ (ఎఫ్‌డీఏ)  ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా భారత సంతతికి చెందిన విన్‌ గుప్తా నియమితులయ్యారు. ఎఫ్‌డీఏ ప్రిన్సిపల్‌ డిప్యూటీ కమీషనర్‌ జానెట్‌ వుడ్‌ కాక్‌ త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విన్‌ గుప్తా నియామకం జరిగింది. ఎఫ్‌డీఏ కమిషనర్‌ రాబర్ట్‌ కాలిఫ్‌కు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తారు. కాగా విన్‌ గుప్తా ప్రస్తుతం అమెజాన్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. 2022 ఫిబ్రవరిలో నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.

Social Share Spread Message

Latest News