Skip to main content

Namaste NRI

అమెరికా శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం… ఫ్యూచర్‌ లో ఆ సమస్య ఉండకపోవచ్చు

పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు గానూ కొత్త ప్రయోగానికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. జియో ఇంజినీరింగ్‌ సాంకేతికతను వినియోగించి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చడం ద్వారా సూర్యరశ్మిని తిరిగి ఆకాశంలోకే వికర్షించేలా చేసి భూమిపైన ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని వీరు చెప్తున్నా రు. దీనిని మెరైన్‌ క్లౌడ్‌ బ్రైటెనింగ్‌ అని పిలుస్తారు. ఇందుకోసం ముందుగా మహాసముద్రంపై దిగువ వాతావర ణంలో సముద్రపు ఉప్పు లేదా ఏరోసోల్‌లను స్ప్రే చేస్తారు.  ఇవి మేఘాలను మరింత ప్రకాశవంతంగా మార్చే కేంద్రకాలుగా పని చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మేఘాలు ప్రకాశవంతంగా మారడం వల్ల సూర్యరశ్మిని వికర్షించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. తద్వారా భూమిపై ఉష్ణోగ్రతలను తగ్గించే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బేలో మొదటి ప్రయోగం చేశారు. కాగా, ఈ మెరైన్‌ క్లౌడ్‌ బ్రైటెనింగ్‌ పద్ధతిపై పలు విమర్శలు కూడా ఉన్నాయి. వాతావరణాన్ని ప్రభావితం చేసే ఈ పద్ధతి వల్ల దుష్ప్రభావాలు ఉండే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News