
రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఎర్రచీర. ది బిగినింగ్ అనేది ట్యాగ్ లైన్. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించడమే కాకుండా ఇందులో కీలక పాత్రను పోషించారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా నిజానికి శివరాత్రి కానుకగా రావాల్సింది. అయితే అనుకున్న సమయంలో వి.ఎఫ్.ఎక్స్. పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాత సుమన్ బాబు తెలిపారు.

చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎన్.వి.వి. సుబ్బారెడ్డి ఎర్రచీ గురించి వివరిస్తూ క్లయిమాక్స్ ఎపిసోడ్ మూవీకి హైలైట్, అనేకమంది అఘోరాలతో శివుడిపై చేసిన ఎపిసోడ్ అత్యధ్బుతంగా కుదిరింది. పిల్లలతో కలిసి కుటుంబమంతా చూడదగ్గ చిత్రమిది అని అన్నారు. సినిమాలో మొత్తం 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయని, అవి అన్ని వర్గాలను అలరిస్తాయని సుమన్ బాబు చెప్పారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను శ్రీరామ్, కమల్ కామరాజ్, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ, సురేశ్ కొండేటి, రఘుబాబు తదితరులు పోషించారు. ప్రమోద్ పులిగిల్ల స్వరాలు సమకూర్చగా, సినిమానే ఎస్.చిన్నా నేపథ్య సంగీతం అందించారు.
