Skip to main content

Namaste NRI

చైనాలో వింత ఘటన.. 20 ఏళ్లుగా

చైనాలో వింత ఘటన వెలుగు చూసింది. 20 ఏళ్లుగా ఓ పురుషుడికి రుతుక్రమం అవుతోంది. మూత్రంలో రక్తం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యుడి వద్దకు వెళ్లిన ఆ వ్యక్తికి షాకింగ్‌ విషయం తెలిసింది. అతడికి గర్భాశయం ఉన్నట్లు వైద్యులు తేల్చారు. అండాలు విడులవుతున్నట్లు గుర్తించారు. జీవశాస్త్రపరంగా అతడు మహిళ అని నిర్ధారించారు. సిచువాన్‌ ప్రావిన్స్‌కు చెన్‌ లీ అనే వ్యక్తికి 20 ఏళ్లుగా మూత్రంలో రక్తం వస్తున్నది. ప్రస్తుతం అతడి వయస్సు 33 ఏళ్లు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు మూత్ర విసర్జన సమస్య ఉండడంతో ఆపరేషన్‌ చేయించుకున్నారు. అప్పటి నుంచి అతడికి మూత్రంలో రక్తంతో పాటు సాధారణ పొత్తికడుపు నొప్పి వస్తున్నది. అతడికి స్కానింగ్‌ తీయగా షాకింగ్‌ విషయం బయటపడిరది. అతడినికి గర్భాశయం, అండాశయాలతో  సహా స్రీ పునరుతత్పి అవయవాలు ఉన్నాయని తెలింది.

Social Share Spread Message

Latest News