అమెరికాలో తెలంగాణ వాసి దుర్మరణం చెందాడు. తన ఇంటి సమీపంలోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు వెళ్లిన ప్రవీణ్ ప్రమాదవశాత్తూ అందులో మునిగి మరణించాడు. సూర్యాపేట ఆత్మకూరు (ఎస్) మండలం పాతర్ల పహాడ్‌కు చెందిన నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో చిన్నవాడైన ప్రవీణ్ (41) హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ చదివాడు. కొంతకాలం ఆస్ట్రేలియాలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.
ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడ ఉపాధ్యాయుడిగా టీచర్‌గా స్థిరపడ్డాడు. అక్కడే తన భార్య శాంతితో కలిసి ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు.ఇంటి సమీపంలోని స్విమ్మింగ్‌పూల్ వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తూ అందులో మునిగి చనిపోయాడు. ప్రవీణ్ చనిపోయిన విషయాన్ని ఆయన భార్య శాంతి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పాతర్ల పహాడ్‌లో విషాద ఛాయలు అలుముకు న్నాయి. ప్రవీణ్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం సహకరించి ఆదుకోవాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాల్ చేసి సహాయం అడిగారు.