Skip to main content

Namaste NRI

జార్జియాలో తీవ్ర విషాదం … 11 మంది భారతీయులు

జార్జియాలోని ఓ ఇండియన్‌ రెస్టారెంట్‌లో దారుణం జరిగింది. అందులో పనిచేస్తున్న 11 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని ఆ దేశంలోని భారతీయ దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుడౌరీలోని పర్వత రిసార్ట్‌కు చెందిన బెడ్‌రూమ్స్‌లో వాళ్లంతా విగతజీవులుగా పడివున్నారని భారతీయ మిషన్‌ వెల్లడించింది. మృతుల వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉందని పేర్కొన్నది. గత శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు జార్జియా పోలీసుల ప్రాథమిక విచారణ పేర్కొన్నది. పోలీసులు కేసు నమోదుచేశారు. వారి మరణాలకు గల కారణాల్ని కనుగొనేందుకు ఫోరెన్సిక్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ దర్యాప్తు మొదలైంది. విషపూరిత వాయువు కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చటం వల్లే వాళ్లంతా మృత్యువాత పడ్డారని పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News