Skip to main content

Namaste NRI

చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ

అమెరికాలో ఓ భారత సంతతి మహిళ చరిత్ర సృష్టించారు. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్‌ నీలి బెండపూడి నియమితులయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళ, శ్వేతజాతీయేతరాలుగా ఆమె చరిత్రకెక్కారు.  ఈ మేరకు యూనివర్సిటీ ఆమె నియామకాన్ని ధృవీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన బెండపూడి ఉన్నత విద్య కోసం 1986 అమెరికాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె లూయిస్‌ విల్లే యూనివర్సిటీలో మార్కెటింగ్‌ ప్రొఫెసర్‌గాను, వర్శిటీ అధ్యక్షురాలిగాను కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియా స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ డిసెంబర్‌ 9న ఆమెను వర్శిటీ తదుపరి అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది. 2022లో ఆమె ఈ పదవి చేపట్టనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల బెండపూడి ఆనందం వ్యక్తం చేశారు.

                అయితే ఆమె వచ్చే ఏడాది 2022లో పెన్‌ స్టేట్‌ 19వ ప్రెసిడెంట్‌గా సేవలందించనున్నారు. ఈ మేరకు నీలి బెండపూడి మాట్లాడుతూ పెన్‌ స్టేట్‌ ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం. ఈ అత్యుత్తమ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి పనిచేయడాన్ని నెనెంతో గర్వంగా భావిస్తున్నా. అంతేకాదు పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీని కొత్త శిఖరాలకు చేరుకునేలా పనిచేయడమే నా ధ్యేయం అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events