Namaste NRI

ఉరుకు పటేల టీజర్‌ను విడుదల చేసిన అడివి శేష్‌

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 2

తేజస్‌ కంచర్ల హీరోగా నటిస్తున్న చిత్రం ఉరుకు పటేల. గెట్‌ ఉరికిఫైడ్‌ ఉపశీర్షిక. వివేక్‌ రెడ్డి దర్శకత్వంలో బాలభాను నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను అడివి శేష్‌ విడుదల చేశారు. చిన్న టౌన్‌లో ఉండే ఓ అబ్బాయి బాగా చదువుకున్న అమ్మాయిని ప్రేమించడానికి చేసే ప్రయత్నాల నేపథ్యంలో టీజర్‌ వినోదాత్మకంగా సాగింది. వినూత్నమైన కథతో ఈ సినిమాను రూపొందించామని, చక్కటి వినోదంతో పాటు అనూహ్య మలుపు లతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. నేటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యే కథాంశమిదని హీరో తేజస్‌ కంచర్ల తెలిపారు. కథలో కొత్తదనం ఆకట్టుకుంటుందని నిర్మాత బాల భాను తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 2
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events