Skip to main content

Namaste NRI

అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష మరోసారి విజయవంతం

అగ్ని ప్రైమ్‌ (అగ్ని`పి ) బాలిసిక్ట్‌ క్షిపణి పరీక్ష  విజయవంతమైంది. అణ్వాయుధాలు మోసుకవెళ్లే సామర్ధ్యమున్న ఈ బలాస్టిక్‌ మిసైల్‌ను ఒడిషా తీరంలోని ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ద్వీపం నుంచి దిగ్విజయంగా ప్రయోగించినట్లు డీఆర్‌డీఏ తెలిపింది. తూర్పు తీరంలో ఏర్పాటు చేసిన పలు టెలీమెట్రీ, రాడార్‌, ఎలక్ట్రో ఆప్టికల్‌  స్టేషన్లు, నౌకల్లో అమర్చిన పరికరాలు క్షిపణి మార్గాన్ని ట్రాక్‌ చేస్తూ దాని పనితీరును పర్యవేక్షించాయి. నిర్దేశించిన ప్రమాణాలను అత్యంత కచ్చితత్వంతో క్షిపణి చేరుకుందని డీఆర్‌డీఓ ప్రకటించింది. ఇందులో పలు అత్యాధునిక ఫీచర్లు పొందుపరిచామని తెలిపింది. 100`2000 కిలో మీటర్ల రేంజ్‌ ఉన్న ఈ క్షిపణిని ఉపరితలం నుంచి ప్రయోగిస్తారు. పరీక్షల్లో క్షిపణి కచ్చితమైన లక్ష్యాసాధన చేసిందని డీఆర్‌డీఓ వెల్లడిరచింది. తొలిసారి ఈ క్షిపణిని జూన్‌ 28న పరీక్షించారు. నేడు జరిపిన రెండో పరీక్షతో క్షిపణి పూర్తి స్థాయి అభివృద్ధి సాధించిందని, వీలయినంత త్వరలో దీన్ని సైన్యంలో ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తున్నామని డీఆర్‌డీఏ తెలిపింది. ఈ సందర్భంగా సైంటిస్టుల బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ప్రశంసించారు. అగ్ని`పి పరీక్ష విజయవంతం కావడంపై డీఆర్‌డీఏ చైర్మన్‌ సతీశ్‌ రెడ్డి హర్షం ప్రకటించారు.

Social Share Spread Message

Latest News