Skip to main content

Namaste NRI

అమెరికా ఆమోదం… భారత్‌కు

జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్‌ ఆమోదం తెలిపారు. సుమారు రూ.442 కోట్లు(52.8 మిలియన్‌ డాలర్లు) విలువైన యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ సోనోబోయొ సను   భారత్‌కు విక్రయించనున్నట్టు వాషింగ్టన్‌లోని డిఫెన్స్‌ సెక్యూరిటీ కో-ఆపరేషన్‌ ఏజెన్సీ(డీఎ్‌ససీఏ) వెల్లడించింది.  నాలుగు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం పెంటగాన్‌లో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌తో చర్చలు జరిపిన అనంతరం ఈ ప్రకటన వెలువడటం విశేషం.

Social Share Spread Message

Latest News