Skip to main content

Namaste NRI

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సెనేటర్లు

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న భారత ప్రజలకు అమెరికన్‌ సెనేటర్లు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికన్‌ సెనేటర్లు జాన్‌ కార్నిన్‌, మార్క్‌ వార్నర్‌, వ్యోమగామి సునితా విలియమ్స్‌ భారత ప్రజలకు అదేవిధంగా ఇండియన్‌ అమెరికన్లకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే రెండు అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికాల మధ్య సత్సంబంధాలు ప్రస్తుతం చాలా అవసరమని పేర్కొన్నారు. భారత్‌, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశాలు. వీటి మధ్య ఉన్న బంధాలు బలంగా ఉండటం గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యం అని మార్క్‌ వార్నర్‌ వ్యాఖ్యానించారు.  ప్రముఖ వ్యోమగామి సునితా విలియమ్స్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌, అమెరికాలు చేసుకున్న సహాయ సహకారాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Social Share Spread Message

Latest News