అమెరికాలోని న్యూజెర్సీలోకి చెందిన గోపీ సేథ్ అనే వ్యాపారవేత్త అమితాబ్‌పై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. రెండేళ్ల క్రితం ఎడిసన్ నగరంలోని తన నివాసం ముంగిట అమితాబ్ నిలువెత్తు విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం దీన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గూగుల్ గుర్తించింది. దీనిపై గోపీ సేథ్ అనందం వ్యక్తం చేశారు. మా నివాసం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. గూగుల్ గుర్తింపు కారణంగా రోజురోజుకీ సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. అమితాబ్ విగ్రహాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు అని సేథ్ తెలిపారు.