అమెరికాలోని సావోర్ అనే స్టార్టప్ కంపెనీ గాలి నుంచి వెన్నను తయారు చేసింది. థర్మోకెమికల్ పద్ధతిలో గాలిలోని కార్బన్‌డైఆక్సైడ్ (సీఓ2) నుంచి కార్బన్ అణువులను, నీటిఆవిరి నుంచి హైడ్రోజన్ అణువులను సేకరించి వాటిని ఒక దగ్గరకు చేర్చి ఆక్సీకరణం చెందించి వెన్నను ఉత్పత్తి చేసింది. ఈ ప్రక్రియలో జంతువు లు, మొక్కల కొవ్వు పదార్థాలను ఏ మాత్రం వాడలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే సీఓ2తో వెన్నను తయారు చేయడం ఒకవిధంగా పర్యావరణానికి మేలు చేయడమేనని పేర్కొన్నారు. ఈ వెన్న రుచి బాగున్నదంటూ ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ పేర్కొనడం గమనార్హం.