Skip to main content

Namaste NRI

పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం

 పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జర్నలిస్ట్, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ అర్ధాంగి రెహమ్ ఖాన్ రాజకీయ పార్టీని ప్రకటించారు. కరాచీ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.  ప్రజల సమస్యలను లేవనెత్తడంలో సామాన్యుడి గొంతుకగా నిలబడేందుకు పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీని ప్రారంభించినట్లు తెలిపారు.

తాను గతంలో ఎప్పుడూ రాజకీయ పదవులు చేపట్టలేదని పేర్కొన్న ఆమె, ఒకసారి ఒక వ్యక్తి (ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశిస్తూ) కోసం పార్టీలో చేరానని చెప్పారు. కానీ ఈ రోజు తాను సొంతంగా రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. ఇది కేవలం పార్టీ మాత్రమే కాదని, రాజకీయాలను సేవగా మార్చే ఉద్యమమని తెలిపారు.ప్రస్తుతం దేశ రాజకీయాలపై ప్రజల్లో పెరుగుతున్న నిరాశ, నిస్పృహ కారణంగా తాను పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. కష్టకాలంలో ఈ ప్రదేశం తనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News