Skip to main content

Namaste NRI

అనసూయ దర్జా ఫస్ట్ లుక్

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం దర్జా. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్‌. నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫస్ట్‌లుక్‌ని ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ పేరుకు తగ్గట్టే లుక్‌ కనిపిస్తోంది. సినిమా దర్జాగానే ఆడి, అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నా అన్నారు.ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ కొత్త రకమైన కథతో రూపొందిస్తున్న చిత్రమిది అన్నారు.  సునీల్‌, అనసూయతోపాటు నటీనటులు ఎంతగానో సహకరిస్తున్నారు. తండ్రి చనిపోయిన బాధతో ఉన్నప్పటికీ చిత్రీకరణకి అంతరాయం కలగకూడదని సెట్స్‌కి వచ్చారు అనసూయ. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ సహకారం మరిచిపోలేనిది అన్నారు. అనసూయ మాట్లాడుతూ నిజాయతీగా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. కెమెరాకి ప్రతిభ కావాలని నిరూపిస్తూ వస్తున్న ఎంతో మంది ప్రతిభావంతులు ఇందులో నటించారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన కనకం పాత్రని చేశా అన్నారు.              

హైదరాబాద్‌, భీమవరం, మచిలీపట్నంలో షూటింగ్‌ చేశాం.  సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శివశంకర్‌ పైడిపాటి నిర్మాత. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ సమర్పిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కామినేని శ్రీనివాస్‌, కెఎల్‌ నారాయణ, సునీల్‌, అనసూయ, పృథ్వీ, షకలక శంకర్‌తో  పాటు చిత్రయూనిట్‌ మొత్తం పాల్గొంది.

Social Share Spread Message

Latest News