Namaste NRI

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో… హీరోయిన్ ఎవరో తెలుసా?

దివంగత జానకీరామ్‌ తనయుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ సీనియర్‌ దర్శకు డు వైవీఎస్‌ చౌదరి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. న్యూ టాలెంట్‌ రోర్స్‌ పతాకంపై యల మంచిలి గీత నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్‌ను ప్రకటించారు.

తెలుగమ్మాయి వీణ రావు హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం, చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించబోతున్నారు. సాయిమాధవ్‌ బుర్రా సంభాషణల రచయిత. ఈ సందర్భంగా దర్శకుడు వైవీఎస్‌ చౌదరి మట్లాడుతూ కీరవాణిగారు యుగపురుషుడు లాంటి వారు. ఆయన నాకు మర్చిపోలేని పాటలు అందిం చారు. అలాంటి గొప్ప వ్యక్తితో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. చంద్రబోస్‌ సాహిత్యం అద్భుతంగా ఉండబోతున్నది. సాయిమాధవ్‌ బుర్రా ప్రతి సినిమాకు గొప్పగా ఎదిగారు. ఆయన మా చిత్రానికి మాటలు రాయడం ఆనందంగా ఉంది. మంచి కూచిపూడి డ్యాన్సర్‌ అయిన తెలుగమ్మాయి వీణ రావుని కథానాయికగా పరిచయం చేస్తున్నాం అన్నారు. కీరవాణి, చం ద్రబోస్‌, వైవీఎస్‌ చౌదరి వంటి గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని సాయిమాధవ్‌ బుర్రా పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]