Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్​కు మరో ఎదురుదెబ్బ- పరువు నష్టం కేసులో భారీ జరిమానా

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కు గట్టి షాక్‌ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్‌ కారోల్‌ వేసిన పరువు నష్టం కేసు లో న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు 83 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ట్రంప్‌ తనను లైంగికంగా వేధించాడని కారోల్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

1990లో మాన్‌హటన్‌ అవెన్యూలోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జీన్ కారోల్ ఆరోపించింది. 2019లో ఓసారి తన గురించి అసభ్యక రంగా మాట్లాడి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ట్రంప్‌నకు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెకు నష్టపరిహారం కింద 18.3 మిలియన్‌ డాలర్లతోపాటు భవిష్య త్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు మరో 65 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఫెడరల్‌ కోర్టు ఆదేశించింది. మొత్తం 83.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకుపైమాటే)  చెల్లించా లని తీర్పు ఇచ్చింది.

Social Share Spread Message

Latest News