Skip to main content

Namaste NRI

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో తుపాకీ తూటాకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో లో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల సాయి తేజ అనే విద్యార్థి మరణించాడు. అతడు ఖమ్మం రూరల్‌ జిల్లా రామన్నపేట్‌కు చెందిన వాడిగా గుర్తించారు. సాయితేజ ఎంఎస్ చ‌ద‌వ‌డానికి నాలుగు నెల‌ల క్రిత‌మే యూఎస్ వెళ్లినట్లు తెలిసింది. అయితే, కాల్పులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాయి తేజ మరణంతో రామన్నపేట్‌ లో విషాద ఛాయలు అలముకున్నాయి. కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త తో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుమారుడి మృత‌దేహాన్ని స్వదేశానికి తీసుకు రావ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు చొర‌వ తీసుకోవాల‌ని కోరుతున్నారు.

Social Share Spread Message

Latest News