అమెరికా ప్రతినిధి బృందం మరోసారి తైవాన్‌ను సందర్శించింది. అమెరికన్ కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు స్టెఫనీ మర్ఫీ నాయకత్వంలోని ప్రతినిధి తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్వెన్‌ను కలుసుకుంది. అమెరికా దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆగస్టు నెలారంభంలో తైవాన్‌ను సందర్శించినప్పటి నుంచి విదేశీ ప్రతినిధులు ఆ దేశానికి వస్తూనే ఉన్నారు. పెలోసీ తరువాత అమెరికాకు చెందిన ఒక సెనెటర్, మరో కాంగ్రెస్ ప్రతినిధి బృందం తైవాన్‌కు వచ్చింది. అరిజోనా, ఇండియానా రాష్ట్రాల గవర్నర్లు కూడా తైవాన్ వచ్చి అక్కడి సెమీకండక్టర్ పరిశ్రమ నాయకులతో చర్చించారు. తైవాన్‌కు అమెరికా ఆయుధ సహాయం అందించాలంటూ కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టిన శాసనకర్తలో స్టెఫనీ మర్పీ కూడా ఉన్నారు. గతవారం తైవాన్‌కు 100 కోట్ల డాలర్ల సహాయన్ని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింన విషయం తెలిసిందే.














