Namaste NRI

 అనుష్క యాక్షన్ విశ్వరూపం… సీతమ్మోరు లంకా దహనం చేసినట్టే – ఘాటి ట్రైలర్ చూశారా?

అనుష్కశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఘాటీ. విక్రమ్‌ప్రభు కీలక పాత్రధారి. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం.  ఈ చిత్రాన్ని రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 5న విడుదలకానుంది. అయితే తాజాగా మూవీ థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

ట్రైల‌ర్‌లో ప్ర‌తి సన్నివేశం ఆక‌ట్టుకుంటుంది.విలేజ్ మ‌హిళా మాస్ అవ‌తార్‌లో అనుష్క లుక్ బాగుంది. ఆమె యాక్ష‌న్ సీక్వెన్సెస్‌లో అద‌ర‌గొట్టింది. ట్రైల‌ర్ మొత్తం కూడా యాక్ష‌న్ డ్రాప్‌లోనే సాగింది. చివ‌ర‌లో సీత‌మ్మోరు లంకా ద‌హ‌నం చేస్తే ఎట్టుంట‌దో చూద్దురు.. కానీ  అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ వినిపించింది. మిగ‌తా డైలాగ్స్ కూడా చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉన్నాయి. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఘట్టాలతో అనుష్కశెట్టి తన పాత్రకు జీవం పోసింది. విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.  

ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని, సినిమా పట్ల అంచనాలను హైకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా అనుష్కను మరో కోణంలో చూపించేందుకు క్రిష్ తీసుకున్న ఈ కొత్త ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్‌, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, రచన-దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి.

Social Share Spread Message

Latest News