Skip to main content

Namaste NRI

అశ్విన్ బాబు వచ్చినవాడు గౌతమ్‌ ఫస్ట్ లుక్ విడుదల

అశ్విన్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం  వచ్చినవాడు గౌతమ్‌. రియా సుమన్‌ కథానాయిక. మామిడాల ఎం.ఆర్‌.కృష్ణ దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. నేడు అశ్విన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్న అశ్విన్‌బాబుని ఈ పోస్టర్‌లో చూడొచ్చు.

ఇటీవలే చిత్రీకరించిన ైక్లెమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నామని, మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రంలో అయేషా ఖాన్‌, మురళీ శర్మ, సచిన్‌ ఖేడేకర్‌, అజయ్‌, వీటీవీ గణేశ్‌ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్‌.బాల్‌రెడ్డి, సంగీతం: గౌరహరి, నిర్మాణం: అరుణశ్రీ ఎంటైర్టెన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News