Skip to main content

Namaste NRI

అగ్రరాజ్యం అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా

వచ్చే ఏడాది చైనాలో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. దౌత్యపరంగా ఒలింపిక్స్‌ గేమ్స్‌ను నిషేధిస్తున్నట్లు ఆ  దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తెలిపారు. ఇటీవలి చైనాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత గేమ్స్‌ను బహిష్కరించడంలో ఆశ్చర్యం లేదని, నిర్ణయం సరైందేనన్నారు. దౌత్యపరంగా గేమ్స్‌ను బాయ్‌కాట్‌ చేసినా అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటారన్నారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనలను ఉటంకిస్తూ ముఖ్యంగా ఇటీవల అణుశక్తితో నడిచే జలాంతర్గాములను కొనుగోలు చేయాలనే మా నిర్ణయాన్ని సంబంధించింది. ఈ ప్రాంతంలో బలమైన రక్షణ దళాన్ని కలిగి ఉండేందుకు ఆస్ట్రేలియా చేస్తున్న ప్రయత్నాలను చైనా విమర్శించింది అన్నారు. తమతో ఉన్న విభేదాలపై చైనాతో చర్చించేందుకు సిద్ధమని ఇందుకు డ్రాగన్‌ దేశం అంగీకరించడం లేదన్నారు.

                అమెరికా తీసుకున్న నిర్ణయంపై చైనా అగ్రహం వ్యక్తం చేసింది. దౌత్యపరంగా క్రీడలను బహిష్కరించడాన్ని ఖండిరచిన డ్రాగన్‌ దేశం పగ తీర్చుకుంటామని హెచ్చరించింది. అయితే ఫిబ్రవరిలో జరిగే వింటర్‌ క్రీడలకు 40 నుంచి అంతకంటే ఎక్కువ మందిని అథ్లెట్లను గేమ్స్‌కు పంపాలని భావిస్తుండగా మోరిసన్‌ ప్రకటన దీనిపై ప్రభావం చూపబోదని  ఆస్ట్రేలియన్‌ ఒలిపింక్‌ కమిటీ పేర్కొంది. అథ్లెట్లను సురక్షితంగా బీజింగ్‌కు చేర్చడం, మళ్లీ ఇంటికి తీసుకురావడం అతిపెద్ద సవాల్‌గా మారిందని కమిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మాట్‌ కారోల్‌ పేర్కొన్నారు. ఇప్పటికే దౌత్యపరంగా ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా బాయ్‌కాట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా సైతం అమెరికాతో కలిసి వెళ్లనున్నట్లు ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events