Skip to main content

Namaste NRI

సీపీఆర్‌పై తానా సారథ్యంలో అవగాహన కార్యక్రమాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గుండెపోటుకు గురైనప్పుడు అత్యవసర సమయాల్లో చేయాల్సిన చికిత్సపై అవగాహనను కల్పించడంతోపాటు, వారికి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా వివిధ పాఠశాలల్లో సీపీఆర్‌, ఏఈడీ శిక్షణ శిబిరాలను తానా ఫౌండేషన్‌ నిర్వహిస్తోందని ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి, తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 100 పాఠశాలల్లో ఈ శిక్షణ శిబిరాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. గుంటూరులో ఆగస్టు 26 నుంచి 30వ తేదీ వరకు 7 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ  కార్యక్రమంలో  తానా ఫౌండేషన్‌ ట్రస్టీ శ్రీనివాస్‌ ఎండూరి, . తానా న్యూఇంగ్లాండ్‌ ఆర్‌ఆర్‌ కృష్ణ ప్రసాద్‌ సోంపల్లి, డాక్టర్‌ ఓ.కె. మూర్తి, ఎన్నారైలు సూర్య తెలాప్రోలు, దగ్గుబాటి సురేష్‌, కరెస్పాండెంట్‌ పాటిబండ్ల విష్ణువర్థన్‌, టొబాకో బోర్డ్‌కు చెందిన జీవిఆర్‌, ప్రిన్సిపాల్‌ షఫీ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News