Skip to main content

Namaste NRI

బ్యాడ్ గర్ల్స్.. కానీ చాలా మంచోళ్లు

అంచల్‌ గౌడ, పాయల్‌ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బ్యాడ్‌గాళ్స్‌. కానీ చాలా మంచోళ్లు ఉపశీర్షిక. రోహన్‌ సూర్య, మొయిన్‌ కీలక పాత్రధారులు. మున్నా ధూలిపూడి దర్శకుడు. ఈ సినిమా టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ను దర్శకులు చందూ మొండేటి, కృష్ణచైతన్య ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ఎంతో మంది అమ్మాయిల నిజజీవిత కథలతో స్ఫూర్తిపొంది ఈ సినిమా తీశాను.

తల్లిదండ్రులు అమ్మాయిలను అమ్మోరులా ధైర్యంగా పెంచాలని చెప్పే కథ ఇది. పాఠశాల విద్యార్థినులకు స్వీయరక్షణ కల్పించేలా ఒక సబ్జెక్ట్‌ను పెట్టాలి. ఇలాంటి అంశాల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా సాగుతుంది అన్నారు. ప్రతీ ఫ్యామిలీ చూడాల్సిన చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సాహిత్యం: చంద్రబోస్‌, నిర్మాతలు: శశిధర్‌ నల్లా, సోమనర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్‌, దర్శకత్వం: మున్నా ధూలిపూడి.

Social Share Spread Message

Latest News