Skip to main content

Namaste NRI

ఆ యూనివర్సిటీలో అమెరికా ఉత్పత్తులపై నిషేధం

రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ప్రపంచంలో ఏ దేశంపై లేని విధంగా కేవలం భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారీగా సుంకాలు విధించారు. పెరిగన టారీఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనికి నిరసగా పంజాబ్‌లోని ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీ అమెరికా ఉత్పత్తులపై నిషేధం విధించింది. తమ క్యాంపస్‌లో అమెరికన్‌ బ్యాండ్ల శీతల పానీయాలను ఇకపై అమ్మేది లేదని స్పష్టం చేసింది. అగ్రరాజ్యం అహకారానికి వ్యతిరేకంగా చేపట్టిన స్వదేశీ 2.O ఉద్యమంలో దేశం మొత్తం భాగస్వామ్యం కావాలని పిలుపునచ్చింది.

అమెరికా విధించిన 50 శాతం దిగుమతి సుంకాలకు నిరసగా పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ తన క్యాంపస్‌లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి బ్రాండ్లు ఉత్పత్తులు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ మేరకు వర్సిటీ ఛాన్సలర్, ఆమ్‌ ఆద్మీ పార్టీ  ఎంపీ అశోక్‌ కుమార్‌ మిట్టల్‌  వెల్లడించారు.

Social Share Spread Message

Latest News