Namaste NRI

16 ఏళ్లలోపు పిల్లలకు నిషేధం :  ఆస్ట్రేలియా

పదహారేండ్లలోపు పిల్లలు యూట్యూబ్‌ వినియోగించడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాలను పిల్లలు వినియోగించడంపై ఇప్పటికే నిషేధం విధించగా, తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్‌ను కూడా చేర్చింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది.

ఈ సామాజిక మాధ్యమాల్లో కంటెంట్‌ పిల్లలకు హానికరంగా మారిందని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. సోషల్‌ మీడియాలో నిర్ణీత వయసు కంటే తక్కువ ఉన్న వారికి ఖాతాలు ఓపెన్‌ చేసేందుకు అనుమతి ఇచ్చే సంస్థకు 4.95 కోట్ల డాలర్ల జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది.

Social Share Spread Message

Latest News