Skip to main content

Namaste NRI

టర్నింగ్ పాయింట్ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన బెల్లంకొండ సాయి

త్రిగుణ్‌ హీరోగా హెబ్బా పటేల్‌, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటించిన చిత్రం  టర్నింగ్‌ పాయింట్‌.  పస్ట్‌లుక్‌ పోస్టర్‌ను హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్‌ దత్తి మాట్లాడుతూ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌కు సస్పెన్స్‌, మాస్‌ అంశాలు జోడించి తీస్తున్నాం. త్వరలోనే టీజర్‌ను కూడా విడుదల చేస్తాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను అలరించే సినిమా ఇది  అన్నారు. దర్శకుడు కుహన్‌ నాయుడు మాట్లాడుతూ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో త్రిగుణ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి అని చెప్పారు.

Social Share Spread Message

Latest News