
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా వీరి వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది. ఈ వేసవిలో ఈ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇటలీ లోని వెనిస్ నగరం వీరి వివాహానికి వేదిక కానుంది.

ఇటలీ తీరంలో బెజోస్‌కు ఉన్న 500మిలియన్ డాలర్ల విలాస నౌక (సూపర్ యాచ్ట్)లో జూన్‌లో వీరి వివాహ వేడుకలు జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.. ఈ జంట అధికారికంగా తమ అతిథులకు వివాహ ఆహ్వానాలను కూడా పంపడం ప్రారంభిం చారు. జూన్‌లో వీరి వివాహం ఉన్నట్లు తెలిసింది. అయితే, ఖచ్చితమైన తేదీ మాత్రం తెలియరాలేదు.
