Namaste NRI

వియత్నాం లో బిలీయనీర్‌కు మరణశిక్ష

మల్టీ బిలియన్‌ డాలర్ల మోసం కేసులో వియత్నాం రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌, బిలియనీర్‌ త్రువాంగ్‌ మిలాన్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. వియత్నాం ప్రఖ్యాత డెవలపర్‌ వాన్‌ తిన్‌ ఫట్‌ కంపెనీకి ఆమె చీఫ్‌. అయితే, గత దశాబ్ద కాలంలో సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ నుంచి ఆమె పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రూ.లక్ష కోట్లు (ఆ దేశ జీడీపీ-2022లో 3 శాతం) ఆమె బ్యాంకు నుంచి తీసుకుం టున్నట్టు తేలింది. అయితే, ఈ కుంభకోణం విలువ రూ.2.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు లంచాలు ఎరగా వేస్తూ ఈ డబ్బును ఆమె అక్రమంగా వేల షెల్‌ కంపెనీలకు మళ్లించినట్టు తేలింది.

ఈ ఫ్రాడ్ కేసులో అనేక మంది అధికారులు కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన సంప‌న్న వ్యాపార‌వేత్త ను మిలాన్ పెళ్లి చేసుకున్న‌ది. అయితే అత‌ను కూడా ఈకేసులో విచార‌ణ ఎదుర్కొం టున్నారు. ఫేక్ లోన్ ద‌ర‌ఖాస్తులతో ఎస్సీబీ బ్యాంకు నుంచి భారీగా డ‌బ్బును విత్‌డ్రా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]