Skip to main content

Namaste NRI

భారత్‌కు బూస్ట్‌.. మద్దతు ప్రకటించిన యూకే

ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. భారత్‌ ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది.

ఇప్పటికే  పలు దేశాలు భారత్‌ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. తాజా గా ఈ జాబితాలోకి యూకే కూడా వచ్చి చేరింది. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 79వ సెషన్‌లో బ్రిటన్‌ ప్రధాని కైర్‌ స్టార్మర్‌ మాట్లాడుతూ యూఎన్‌ఎస్‌సీలో మరిన్ని దేశాలు ప్రాతినిధ్యం వహించా లని పేర్కొన్నారు. భద్రతా మండలిలో తగినన్ని సభ్యదేశాలు లేనంతవరకూ ప్రతిపక్ష ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు సాగడం కష్టం. కాబట్టి భద్రతామండలిని మరింత పటిష్టం చేయాలి. ఇందులో భాగంగానే శాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్యను పెంచాలి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా భారత్‌, బ్రెజిల్‌, జపాన్‌, జర్మనీ ఉండాలని కోరుకుంటున్నాం. ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి  అని అన్నారు.

Social Share Spread Message

Latest News